Monday, October 3, 2011

SISTAKARANAMS

'శిష్టి'అనగా రాజశాసనం అని అర్ధం. కరణం అంటే వ్రాసేవాడు.రాజశాసనం వ్రాసేవారిని శిస్టికరణం అని పులువబడేవారు. అది కాలక్రమేనా 'శిష్టకరణం' గా రూపాంతరం చెందింది. వీరి ఉపశాఖలు అనేక ప్రాంతాలలో చిట్టికరణములు,దుబ్బైకరణాలు అని కూడా పిలువబడుచున్నారు. శిష్టకరణాలు చిత్రగుప్తుని సంతతివారని స్వర్గీయ కొండవలస చలపతి రావు గారు వ్రాసిన 'శిష్టకరణం ల సంపూర్నచరిత్ర' అనే గ్రంధములో వ్రాయబడియున్నది. చిత్రగుప్తుని కుమారుడగు విచిత్రగుప్తుని రెండవ కుమారుడైన గౌడ సంతతివారుగా లిఖిన్చబదియున్నది.ఈ శిష్టకరణాలు లో పన్నెండు ఉప శాఖాలున్నాయని, వారందరూ కుడాశిష్టకరణాలు అని వ్రాయబడియున్నది.
'శిష్టకరణం' కుల చరిత్ర కళింగ రాజులతో ముడిపడియున్నది.ఆనాటి కళింగ దేశ ప్రాంతమైన గోదావరి-మహానది మధ్య ప్రాంతములో గ్రామ కరణములు గా శిష్టకరణాలు నియమితులయ్యారు. ఆంగ్లేయుల పరిపాలనా కాలం లో కుడా వీరు గ్రామ కరణాలుగా వుండేవారు. వారి పరిపాలనా కాలం లో వీరిని వంశపారంపర్య హక్కు కల్పించడం జరిగింది. ఐతే స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి ఈ వంశపారంపర్య వ్యవస్థ రద్దు చేయడం జరిగింది.
వృత్తిపరంగా శిష్టకరణాలు గ్రామోద్యోగులు గానే నియమించబడేవారు. ఉద్యోగమే వారి వ్రుత్తి. ఈ వ్రుత్తి మూలంగా శిష్టకరణాలు అధిక సంఖ్యలో విద్యాభ్యాసం చేసుకున్నారు. వీరందరూ చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరి జీవనోపాధి చేసుకుంటున్నారు.ఈ కులస్తులు ఎక్కువగా శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులు ఉపాధ్యాయ వృత్తిలో వున్నారు. అంతే కాక చాలా మంది వ్యవసాయ కూలీలుగాను, పరిశ్రమలలో వర్కర్స్ గాను కూడా పని చేయుచున్నారు.
ఉద్యోగరీత్యా వలస వెళ్ళిన శిష్టకరణాలు ఆంధ్ర రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఉద్యోగరీత్యా స్థిరనివాసం ఏర్పరచుకొని ఉన్నారు. హైదరాబాద్ మహానగరం లో చాల పెద్ద సంఖ్యలో వీరు నివాసమేర్పరచుకున్నారు. అంతే కాక చ్చత్హిస్గాద్,ఓడిసా,ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలలో కూడా వీరు వున్నారు.
వీరిలో అధిక సంఖ్యాకులు ఫ్యాక్టరీ లలో టెక్నీషియన్లు గా, క్లార్కులు గా పనిచేయుచున్నారు. వున్నత విద్య అభ్యసిన్చుకున్న వారు ఇంగినీర్లుగా, సాఫ్ట్వేర్ రంగంలో, మనజ్మేంట్ రంగంలో కొద్దిమంది పనిచేయుచున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభూత్వం, బి సి కమిషన్ వారు ఈ కుల స్థితిగతులను కూలంకషంగా అధ్యయనం చేసి వీరి ప్రగతి కోసం శిష్తకరణం కులాన్ని జీ వో ఎం ఎస్ ౧౩,౧౯-౨-౨౦౦౯, ద్వారా బి.సి.డి లో చేర్చడం జరిగింది. ఈ జీ వో ద్వారా ఈ కులస్తులకు విదాభ్యాసం లోను, ఉద్యోగాలలోనూ ప్రోత్సాహం జరిగుతోంది. ఈ మంచి అవకాశాన్ని కులస్తులందరూ ఉపయోగించుకోగలరు.

No comments:

Post a Comment